Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పోక్సో యాక్ట్ సెక్షన్ 11 కింద నమోదైన కేసుల్లో మూడేండ్ల వరకు జైలు శిక్ష పడే కేసులు బెయిలబుల్ కాదని, కాగజబుల్ కేసులని హైకోర్టు తీర్పు చెప్పింది. ఐపీసీ కింద నమోదు చేస్తున్న ఆ తరహా కేసుల్లో మూడేండ్ల వరకు శిక్షపడే కేసులు నాన్ కాగ్నిజబుల్, బెయిలబుల్‌గా పరిగణిస్తున్నారని చెప్పి, పోక్సో యాక్ట్ కేసుల్లో కూడా ఆ విధంగా పరిగణించేందుకు లేదని స్పష్టం చేసింది. పాత మహబూబనగర్ జిల్లా, ప్రస్తుతం గద్వాల జిల్లాలో భాస్కర్ అనే ప్రభుత్వ టీచర్ తనపై పోక్సో యాక్ట్ కింద పెట్టిన కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తుది ఉత్తర్వులు జారీ చేశారు.