Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాలెండర్ ఆవిష్కరణలో నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతుల సేవకే ఉద్యోగులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు అంకితభావంతో పని చేయాలన్నారు. గత ఎనిమిదేండ్లలో పెరిగిన పంటలు, విస్తీర్ణం, ఉత్పత్తితో మార్కెటింగ్ ఉద్యోగులపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. పంటల కొనుగోళ్లలో మార్కెటింగ్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో టీఎన్జీవో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం 2023 డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ళ రాజేందర్, ప్రతాప్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవికుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షులు చిలక నరసింహారెడ్డి, కార్యదర్శి ఫసుద్దీన్, అన్ని జిల్లాల అధ్యక్ష్య, కార్యదర్శులు, సెంట్రల్ ఫోరం కార్యవర్గం సభ్యులు, మార్కెట్ కమిటీ ఉద్యోగులు పాల్గొన్నారు.