Authorization
Sat May 03, 2025 08:56:32 am
- బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యా ద్వారానే మహిళల జీవితాల్లో మార్పు వస్తుందని విశ్వసించి, బాలికల విద్యకోసం జీవితకాలం పోరాడిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అని మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్యబట్టు కొనియాడారు. సావిత్రీబాయి ఫూలే 192వ జయంతి సందర్భ ంగా మంగళవారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి ఫూలే ఆశయాలను నిజం చేస్తూ బీసీలకు ఉన్నత విద్యను అందిస్తున్నదని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా మహిళల కోసం రెండు వ్యవసాయ డిగ్రీ కాలేజీలను ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. బాలికలు సావిత్రీబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకుని తాము చదువుకోవడమే కాకుండా తమ చుట్టూ ఉన్న సమాజంలోని ఆడపిల్లలందరూ చదువుకునేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు.