Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రిని ఫోన్లో పరామర్శించిన సీఎం కేసీఆర్
నవతెలంగాణ - కరీంనగర్
బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య(87) క్రిస్టియన్ కాలనీలోని స్వగృహంలో బుధవారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న గంగుల కమలాకర్ కార్యక్రమాలను రద్దు చేసుకొని వెంటనే ఇంటికి చేరుకున్నారు. గంగుల మల్లయ్యకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. మంత్రి చిన్న కుమారుడు.మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మంత్రికి ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గంగుల మల్లయ్య ఆత్మకు శాంతిని చేకూరాలని ఆకాంక్షించారు.