Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన సేఫ్ హౌస్ టెక్ తెలిపింది. దీంతో తన బాడీగార్డ్ యాప్ ద్వారా ప్రత్యేకమైన సైబర్ బీమాను అందించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే వివిధ డిజిటల్ రక్షణ ఫీచర్లను అందిస్తున్న తమ యాప్, ఇప్పుడు వ్యక్తిగత కస్టమర్ల కోసం డిజిటల్ మోసాల నుంచి ఆర్థిక నష్టాలకు కవరేజీని అందిస్తోందని తెలిపింది. అనధీకత డిజిటల్ లావాదేవీలకు హెచ్డీఎఫ్సీ ఎర్గో నుంచి ఒక సంవత్సరం రూ.25వేల కాంప్లిమెంటరీ కవరేజీని అందించనున్నట్లు వెల్లడించింది. అలాగే ప్రాధాన్య మద్దతు, ప్రత్యేక క్లెయిమ్ డెస్క్‌ను అందించడం ద్వారా సైబర్ బీమా కవర్ వినియోగదారులకు ''ఇంటర్నెట్ బీమా''ను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. దేశంలో సైబర్ నేరాల్లో అత్యధిక కేసులు నమోదైన మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని.. ఇక్కడ జరిగేవాటిలో దాదాపు 85 శాతం కేసులు ఆర్థిక నేరాలే అవుతున్నాయని తెలిపింది.