Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బండ్లతోని, గుండ్లతోని
అయ్యేదేమీ లేదు
దేశంలో విచ్ఛన్నకర సంస్థలు రాజ్యమేలుతున్నాయి
ధరణి సమస్యలతో ప్రజల అవస్థలు
'హాత్ సే హాత్ అభియాన్'ను విజయవంతం చేయండి
టీపీసీసీ శిక్షణా
తరగతుల్లో రేవంత్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. నిపుణులు సూచనలతో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతున్నదని చెప్పారు. అలాంటి నుంచి విముక్తి కల్పించేది కాంగ్రెస్ మాత్రమేననీ, బండ్లతోని, గుండ్లతోని అయ్యేది ఏం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఓటరు జాబితాలో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ధరణితో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలాజీ కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక రోజు శిక్షణా తరగతులను నిర్వహించారు. ధరణి, హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెెన్స్, మీడియా, సోషల్ మీడియా తదితర అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ జోడో యాత్ర చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో హాత్సేహాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు భయపడకుండా రాహుల్ ప్రాణాలకు తెగించి యాత్ర చేస్తున్నారని రేవంత్ తెలిపారు.ఈ నేపథ్యంలో పార్టీ ప్రతిష్టను పెంచేలా సందేశాన్ని తీసుకెళ్ళాల్సిన బాధ్యత మన అందరీపై ఉందన్నారు. ధరణితో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటు న్నారని తెలిపారు. ఓటర్ల జాబితాలో కాంగ్రెస్ సాను భూతిపరుల ఓట్లు తొలగిస్తే వాటిని తిరిగి చేర్పించా ల్సిన అవసరముందన్నారు.రాష్ట్రంలో విపత్కార పరిస్థితులను పునరావృత్తం కాబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడితే పని చేస్తే కేసీఆర్ ఒక లెక్క కాదనీ, కలిసికట్టుగా ముందుకుపోవాలని కోరారు. దుష్టశక్తులు ఆశించినట్టు తెలంగాణ సమాజానికి నష్టం చేయబోమని ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ శ్రేణులు నిరూపించాయనీ, ఆ స్ఫూర్తిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 'పార్టీ ఎలా ఆదేశించినా సామాన్య కార్యకర్తలా పనిచేస్తా. పదవిలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం కట్టుబడి పని చేస్తా. పార్టీ కోసం పదవుల్ని, ప్రాణాల్ని త్యాగం చేసేందుకు నేను సిద్ధం. ఏ త్యాగం చేయడానికైనా నేను సిద్ధం' అని రేవంత్ ఈ సందర్భంగా వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వైఖరేంటని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడుకు సంబంధించి కేసీఆర్ తెలంగాణా వైపు ఉంటాడా? రాయలసీమ వైపు ఉంటాడా? గోదావరి, కష్ణా వివాదాలపై వైఖరేంటని ప్రశ్నించారు. ఆంధ్రా నేతలు కూడా ఇంత దారుణంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయలేదన్నారు. 'కార్యోన్ముఖులమై కదులుదాం. ఉప్పెనలా కేసీఆర్ కుటుంబాన్ని కప్పేద్దాం' అంటూ పిలుపునిచ్చారు.