Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సకాలంలో అందని పాలబిల్లులు
- రాష్ట్రం మొత్తం వచ్చినా ఖమ్మంలో ఆలస్యం
- పక్షానికోసారి ఐదారు రోజులు లేటు
- డీడీని అడిగితే మేనేజర్లపై నెపం
- రైతుల ఆందోళన
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్ర మాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖమ్మం విజయ డెయిరీ లోపాల పుట్టగా తయారైంది. అస్తవ్యస్త విధానాలతో సకా లంలో బిల్లులు అందక రైతులు అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పక్షం రోజులకోసారి రావాల్సిన బిల్లులు ఖమ్మం డెయిరీలో మాత్రం ఐదారు రోజులు ఆలస్యమవుతుండటంతో రైతు లు ఆర్థికంగా ఇబ్బంది పడు తున్నారు. సకాలంలో బిల్లులు ఇవ్వాలని కేంద్రాల నిర్వా హకులు డెయిరీ ఉపసంచాలకులను నిల దీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని విజయ డెయిరీ ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించారు.
ప్రశ్నిస్తే కేసులు..
డెయిరీ ఉపసంచాలకుల తీరు, ల్యాబ్‌టెక్నీషియన్ వైఖరీ కారణం గానే బిల్లులు ఆలస్యమవుతు న్నాయని సొసైటీ నిర్యాహకులు ఆరోపిం చారు. ఇదే విషయమై పాడిరైతుల పరి రక్షణ రాష్ట్రవ్యాప్త వాట్సాప్ గ్రూప్ లోనూ కొన్ని పోస్టులు పెట్టారు. ల్యాబ్ టెక్ని షియన్లు బంధువుల పేర్లతో మిల్క్ పార్లర్లు నిర్వహిస్తూ దొడ్డిదారిలో పాలు తరలిస్తున్నారని ఆరోపిం చారు. ఇంత జరుగు తున్నా ఉపసంచాలకులు చూసీ చూడ నట్టు వ్యవహరిస్తు న్నారని వివిధ పాడి రైతు సొసైటీల అధ్యక్షులు మండి పడ్డారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత సొసైటీల నిర్వాహకులపై ల్యాబ్టెక్నిషి యన్ ఖమ్మం టూటౌన్ పోలీసుస్టేషన్లో కేసు పెట్టారని బాధితులు తెలిపారు. వారం రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిప్పినట్టు వాపో యారు. తిరిగి రైతులు కూడా డీడీ వి.సత్యనారాయణ, ల్యాబ్‌టెక్నిషియన్ నాగశ్రీపై కేసు పెట్టడంతో చివరికి ఇరువర్గాలు రాజీకి వచ్చాయి.
నెలరోజులుగా ఆలస్యం..
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 15 రోజులకోసారి పాడిరైతులకు బిల్లులు చెల్లిస్తుంటారు. తొలి పక్షం రోజులకు సంబంధించి 30, 31 తేదీల్లో బిల్లులు చేసి హైదరాబాద్‌లోని సమాఖ్య కార్యాలయానికి పంపితే 1 లేదా 2 తేదీలోగా అకౌంట్లలో డబ్బులు పడతాయి. రెండో పక్షం రోజులకు చెందిన బిల్లులు 16, 17 తేదీల్లో చెల్లిస్తారు. కానీ డిసెంబర్ నెలకు సంబంధించిన మొదటి పక్షం రోజుల బిల్లులు ఆరు రోజులు ఆలస్యంగా 22వ తేదీన పడ్డాయి. రెండో పక్షం రోజుల బిల్లులు రాష్ట్రవ్యాప్తంగా 2వ తేదీ నాటికి అకౌంట్లలో జమ అయ్యాయి. కానీ ఖమ్మం జిల్లా పాడి రైతుల బిల్లులు మాత్రం 5వ తేదీ సాయంత్రం వరకూ జమ కాలేదు. బిల్లులు ఆలస్యమవ్వడం వల్ల జిల్లా వ్యాప్తంగా 230 సెంటర్లకు చెందిన పదివేల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోరైతుకు రోజుకు కనిష్టంగా రూ.300 గరిష్టంగా రూ.10వేల వరకు ఖర్చు వస్తుండటంతో ఆర్థికంగా సతమతమవుతున్నారు. ఫ్యాట్ లెవల్ 7 వస్తే రూ.50, 7.2 వస్తే రూ.72 చొప్పున జిల్లా వ్యాప్తంగా రూ.కోటి వరకు పక్షం రోజుల బిల్లులు రైతులకు అందాల్సి ఉంది.
అస్తవ్యస్త విధానాలే కారణం?
డెయిరీ నిర్వహణలో అస్తవ్యస్తత నెలకొనడం తోనే బిల్లులు ఆలస్యమవుతున్నాయని సొసైటీ నిర్వా హకులు ఆరోపిస్తున్నారు. డెయిరీ లాస్లో నడుస్తుందనే నెపంతో బిల్లులు ఆలస్యం చేస్తున్నారని, రైతులు పోసిన పాలకే బిల్లులు ఇస్తున్నప్పుడు ఈ కారణం సహేతుకం కాదని అంటున్నారు. ల్యాబ్ నిర్వహణలోని లోపాలు, టెక్నిషియన్ల ఇష్టారాజ్యం, మేనేజర్లు, డీడీ మధ్య సమన్వయలోపం వెరసి పాలన అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపిస్తున్నారు. పాడిలేని చైర్మెన్ వెంకటయ్య కూడా ఇందుకు మరో కారణమని చెబుతున్నారు. గతంలో డీడీగా ఉన్న భరతలక్ష్మిని పక్కకు పెట్టి ఆమె స్థానంలో రవికుమార్‌ను నియమించారు. కొద్దిరోజులకే రవికుమార్‌ను హైదరాబాద్ బదిలీ చేశారు. ఆయన స్థానంలో సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. భరతలక్ష్మిని మేనేజర్‌గా నియమించారు. ఆమె గత నెల సిక్ లీవ్ తీసుకోవడంతో ఇన్చార్జి మేనేజర్‌గా రవికుమార్‌ను నియమించారు. తిరిగి ఆమె 4వ తేదీన విధుల్లో చేరారు. రవికుమార్ హైదరాబాద్ వెళ్లారు. బిల్లులు చేయాల్సిన మేనేజర్, డీడీల మధ్య సమన్వయలోపమే బిల్లుల ఆలస్యానికి ప్రధాన కారణంగా సెంటర్ల బాధ్యులు ఆరోపిస్తున్నారు.
బిల్లుల ఆలస్యంపై రైతులు నిలదీస్తున్నారు..
ఇమ్మిడి శ్రీను, లాలాపురం సొసైటీ ప్రెసిడెంట్, డెయిరీ డైరెక్టర్
బిల్లులు ఆలస్యమవుతుండటంతో రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఇదే విషయమై డీడీని ప్రశ్నిస్తే మేనేజర్లపై నెపం వేస్తున్నారు. ల్యాబ్టెక్నిషియన్ల వైఫల్యం కూడా దీనికి తోడైంది. దీనివల్ల బిల్లులు ఆలస్యమవుతున్నాయి. దీనిపై డీడీకి తరచూ ఫోన్ చేస్తున్నానని నా నంబర్ బ్లాక్ చేశారు. ఆవేదన చెప్పుకుందామని డెయిరీకి వచ్చాం. మా గోడు వినిపించుకునే పరిస్థితి లేకపోవడంతో ధర్నా నిర్వహించాం. తిరిగి గురువారం రాత్రి కల్లా బిల్లులు పడకపోతే తిరిగి శుక్రవారం ధర్నా నిర్వహిస్తాం.
నెలరోజులుగా కొంత ఆలస్యమవుతోంది..
వి.సత్యనారాయణ, ఉపసంచాలకులు, విజయ డెయిరీ, ఖమ్మం
నెలరోజులుగా వివిధ కారణాలతో బిల్లులు ఆలస్యమవుతున్నాయి. బుధవారమే చేసి పంపించాం. గురువారం రాత్రికి బిల్లులు పడతాయి. ఇటువంటి పరిస్థితి మరోమారు పునరావృతం కాకుండా చూస్తాం.