Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడిలో వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు
నవతెలంగాణ-గండిపేట్
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం బైక్‌పై వెళ్తున్న వారిని అడ్డుకుని, వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషోర్ కుమార్(44), తన స్నేహితుడు తులసితో కలిసి బైక్‌పై నార్సింగికి వెళ్తున్నాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్ సమీపంలోని రక్త మైసమ్మ టెంపుల్ వద్ద ఔటర్ రోడ్డు పక్కన వీరిని దోపిడీ ముఠా అడ్డుకుంది. వీరిపై దొంగలు తల్వార్‌తో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన కిషోర్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. తులసి వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆయన వెంట పడి మరీ అతనిపై తల్వార్‌తో దాడి చేశారు. ఆ దాడిలో అతని నాలుగు చేతివేళ్లు తెగి పోయాయి. గాయాలతో తల్లడిల్లుతుంటే తన వద్ద ఉన్న రూ.15వేలు దొంగలు లాక్కున్నారు. ఈ క్రమంలోనే అతను వారి నుంచి తప్పించుకుని నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. వెెంటనే పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.