Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 స్టార్ రేటింగ్‌లో తొలి మూడుస్థానాల్లో రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి
- 3 స్టార్, 2 స్టార్ రేటింగ్స్‌లోనూ మొదటి స్థానంలో తెలంగాణ పల్లెలే
- అధికారులు, సిబ్బందికి మంత్రి ఎర్రబెల్లి అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 4 స్టార్, 3 స్టార్, 2 స్టార్ రేటింగ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణకు మొదటి స్థానాల్లో అవార్డులు రావడం పట్ల అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు. అచీవర్స్ 3 స్టార్ రేటింగ్‌లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలువగా జగిత్యాల జిల్లా రెండవ స్థానాన్ని సాధించిందన్నారు.పెర్ఫార్మర్స్ 2 స్టార్ రేటింగ్ లోనూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి స్థానాన్ని సాధించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా అభివృద్ధి చేసి చూపెడుతున్నారని చెప్పారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో గుణాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నా, నిధులు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నా అభివృద్ధి విషయంలో అవార్డులు రావడం కేసీఆర్ గొప్ప నిర్ణయాల వల్లనే సాధ్యమవుతున్నదని చెప్పారు.