Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన
- ఆకతాయిలను కఠినంగా శిక్షించాలని డిమాండ్
నవతెలంగాణ-ఘట్కేసర్
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్‌లోని ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్‌లో విదAా్యర్థినుల ఫొటోలు మార్ఫింగ్‌పై ఉద్రిక్త ఏర్పడింది. తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరించడాన్ని నిరసిస్తూ విద్యార్థినులు నిరసనకు దిగారు. ఆకతాయిలను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో గురువారం కాలేజీ ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వివరాల్లోకెళ్తే.. గుర్తు తెలియని ఆగంతకుడు ప్రయివేట్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినుల ఫోన్ నెంబర్స్ సేకరించి తద్వారా వాట్సాప్ గ్రూపులో ఉన్న ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. ఆ ఫొటోలను అదే కళాశాల విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా విద్యార్థినులను బెదిరిస్తున్నాడు. దీనిపై గతేడాది నవంబర్ 9న ప్రిన్సిపాల్‌కు, ఈనెల 4న రాత్రి హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న ఎస్ ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ నాయకులు గురువారం కళాశాల గేటు ముందు ధర్నాకు దిగారు. పోలీ సులు అక్కడికి చేరుకొని వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతేడాది నవంబర్ 9 నుంచి కళాశాలలో ఫొటోల ను మార్ఫింగ్ చేస్తున్నారని విద్యార్థినులు ఫిర్యాదులు చేసినా యాజమాన్య ం పట్టించుకోలేదని ఆరోపించారు. హ్యాకర్ ప్రస్తుతం వేర్వేరు నెంబర్లతో ఫోన్ చేసి ఇప్పటికీ బెదిరిస్తున్నారని తెలిసిందన్నారు. ఓ విద్యార్థిని ఆత్మ హత్యాయత్నం చేసుకుందని చెప్పారు. విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్ చేసిన నిందితున్ని త్వరలో పట్టుకుంటామని, ఇప్పటికే రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసినట్టు మల్కాజిగిరి ఏసీబీ నరేష్ రెడ్డి తెలిపారు.