Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నగర అధ్యక్షులు రోహిన్‌రెడ్డి
హైదరాబాద్ : కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయడం మంచి పరిణామామని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి చెప్పారు. కంటోన్మెంట్ ప్రజలు అనేకసార్లు ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఆయన కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారని గుర్తు చేశారు. అయితే తమ పార్టీ వల్లే కమిటీ ఏర్పాటు చేసిందంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కొత్త కమిటీలో మేయర్‌తో సహా ఎనిమిది మంది సభ్యులు ఉంటారని చెప్పారు. మీడియా సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.