Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీసవేతనాలిచ్చి రెగ్యులర్ చేయాలి : జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మిషన్ భగీరథ కార్మికులకు పెండింగ్ బకాయి వేతనాలను చెల్లించాలనీ, కనీస వేతనమివ్వడంతో పాటు రెగ్యులర్ చేయాలని తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్టు, ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) నాయకులు వంగూరు రాములు(సీఐటీయూ), ఆర్.చంద్రయ్య(ఏఐటీయూసీ), ఎం.రవి(టీఆర్ఎస్కేవీ), సూర్యం (ఐఎఫ్టీయూ) డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో జేఏసీ సమావేశం జరిగింది. అనంతరం మిషన్‌భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డికి జేఏసీ నాయకులు వెళ్లి వినతిపత్రం అందజేశారు. మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న 16వేలకు పైగా కార్మికులు (పంపు ఆపరేటర్లు, ఫిట్టర్లు, లైన్మెన్లు,ఎలక్ట్రిషియన్లు, తదితర క్యాటగిరీలు) సమస్యలను ఈఎన్సీ దృష్టికి తీసుకెళ్లారు. కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు అమలు కావట్లేదని వాపోయారు. పలు జిల్లాల్లో పథక నిర్వహణ ను ప్రయివేటుకు అప్పగించడం వల్ల ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా వేతనాలిస్తున్న తీరును వివరించారు. ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి చట్టబద్ద హక్కులు అమలు కావడం లేదని తెలిపారు. స్కిల్డ్ కార్మికులకు అన్‌స్కిల్డ్ వేతనాలు చెల్లించడం దారుణమని పేర్కొన్నారు. ఎనిమిదిగంటల పని విధానం అమలు చేయడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలనీ, హెల్త్‌కార్డులు, గుర్తింపుకార్డులివ్వాలని కోరారు. విధి నిర్వహణలో చనిపోతే వారి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించా లని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికీ ఫోన్, పెట్రోల్ అలవెన్స్‌ల కోసం రూ.5 వేలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంజి రాల శ్రీనివాస్(సీఐటీయూ), నర్సింహ్మ(ఏఐయూటీసీ), బాబురావు (టీఆర్ఎస్కేవీ), కిరణ్(ఐఎఫ్టీయూ), తదితరులు పాల్గొన్నారు.