Authorization
Thu May 01, 2025 12:10:01 pm
- ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మెన్ మెట్టుసాయి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మెన్ మెట్టుసాయికుమార్ డిమాండ్ చేశారు. మూడు నెలల్లో సమస్యలను పరిష్కారించకపోతే మత్స్యశాఖ మంత్రిని జిల్లాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో ఫిషర్మెన్ రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామగ్రామాన మత్స్యకారుల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జిల్లా మత్స్యకార అధికారులకు పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పిస్తామనీ, అప్పటికీ పరిష్కారం కాకపోతే మత్స్యభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా మత్స్యకారుల సమస్యలపై సిట్టింగ్ జడ్జిగానీ, రిటైర్డ్ ఐఏఎస్‌తో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.