Authorization
Thu May 01, 2025 06:33:02 am
- విద్యార్థి, నిరుద్యోగ నేత చనగాని దయాకర్
నవతెలంగాణ-ఓయూ
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని విద్యార్థి, నిరుద్యోగ నేత చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. శనివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరుద్యోలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ 2014 నుంచి పారదర్శకత లేని నోటిఫికేషన్లతో, అవగాహన లేని అధికారులతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడు తున్నారని విమర్శించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలని నిరు ద్యోగులు కష్టపడుతుంటే.. కొత్త నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అవినీతి అక్రమ పాలనపై నిరుద్యోగ విద్యార్థులు గళం ఎత్తాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్ తీరును ఖండించాలని కోరారు. చనిపోయిన నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి ఆయా కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం చిన్నగాని దయాకర్, నాయకులు మేడా శ్రీనివాస్, నాయక్, రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మెన్ భీంరావు నాయక్, జేఎల్, డీఎల్ అభ్యర్థి గిరిజన సంఘ నాయకుడు కొర్ర ఈశ్వర్ లాల్ నాయక్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి ఓయూ పీఎస్కు తరలించారు.