Authorization
Fri May 02, 2025 07:29:35 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ లోని ఆర్టిలరీ సెంటర్లో అగ్నివీర్ల మొదటి బ్యాచ్‌కు శిక్షణ ప్రారంభమైంది. జనవరి ఒకటో తేదీ నుంచి చారిత్రక గోల్కొండ కోట పరిసరాల్లో ఉన్న 1,900 ఎకరాల గ్యాలరీలో వీరు శిక్షణ పొందుతున్నారు. మొదటి బ్యాచ్‌లో 2,265 మందికి మొదలైన శిక్షణ 31 వారాల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ శిక్షణలో రాజ్యాంగం, సైబర్ భద్రతకు సంబంధించిన ప్రాథమిక అంశాలు, రైఫిల్ ఫైరింగ్, సైన్యానికి సంబంధించిన కమ్యూనికేషన్ తదితర విషయాలను వీరు అభ్యసించనున్నారు. కమాండెంట్ ఆర్టిలరీ సెంటర్ బ్రిగేడియర్ రాజీవ్ చౌహాన్ మాట్లాడుతూ, శిక్షణలో ఆధునాతన సాంకేతికత కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.