Authorization
Fri May 02, 2025 03:59:50 pm
- ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 18న చేపడతామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించినా, సచివాలయం పనులు ఇంకా పూర్తికాలేదు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే రోజున ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దాదాపు లక్ష మందిని సమీకరించడం ద్వారా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌ను ఆహ్వానించారు. అలాగే యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కర్నాటక మాజీ సీఎం కుమార స్వామిని సైతం పిలిచారు. కొత్త సచివాలయం పనులు వేగంగా సాగుతున్నా, ఈనెల 18 నాటికి పూర్తయ్యే అవకాశం లేదని అధికారిక సమాచారం.