Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ తన పథకాలను క్యాంపెయిన్ చేయ డానికి సరికొత్త ఆలోచన చేసింది. ఆ బ్యాంక్ సిబ్బంది హైదరాబాద్లో ఆదివారం వేకువ జామునే 'డోర్ టు డోర్ క్యాంపెయిన్'ను చేపట్టారు. ఇండియన్ బ్యాంక్ అందిస్తున్న 'ఇండ్ శక్తి 555 డేస్' ప్లాన్ సహా డిజిటల్ ఉత్పత్తులు, కరెంట్, సేవింగ్ ఎకౌంట్లు, రిటైల్ రుణాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ చంద్ర ప్రకాశ్ నేతృత్వంలో జరిగిన ఈ క్యాంపెయిన్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, చీఫ్ మేనేజర్లు, ఇతర ఉద్యోగ, సిబ్బంది పాల్గొన్నారు.