Authorization
Thu May 01, 2025 12:02:38 am
- హరితహారం, అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అధ్యయనం
- పచ్చదనం పెంపులో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని ప్రశంస
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడెమీ, డెహ్రాడూన్ లో శిక్షణలో ఉన్న 33 మంది (2021 బ్యాచ్) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులు తెలంగాణలో పర్యటించారు. జాతీయ ఫారెస్ట్ అకాడెమీలో రెండేళ్ల శిక్షణలో ఉన్న ఈ అధికారుల బందం క్షేత్ర పర్యటనలు, విజయవంతమైన అటవీ పద్దతులను అధ్యయనం చేయటంలో భాగంగా హైదరాబాద్, సిద్దిపేట, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించారు. పర్యావరణ మార్పులను ఎదుర్కోవటంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, అటవీ శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ట్రెయినీ ఐఎఫ్ఎస్ల బందం ప్రశంసించింది. కొత్త రాష్ట్రమైనా అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపును ఒక ప్రాధాన్యతా పథకంగా అమలు చేస్తూ గొప్ప ఫలితాలు రాబట్టారని రాష్ట్ర అటవీ అధికారులను వారు మెచ్చుకొన్నారు. తెలంగాణలో చూసిన, నేర్చుకున్న అటవీ పద్దతులు తమ సర్వీసులో చాలా ఉపయోగపడతాయని ట్రెయినీ అధికారులు తెలిపారు.