Authorization
Wed April 30, 2025 11:09:53 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి, ఇంటర్మీడియెట్ తర్వాత పిల్లల కెరీర్‌పై తల్లిదండ్రులు, అధ్యాపకుల పాత్రపై ఈనెల 29న ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెప్ పి క్రిష్ణప్రదీప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో ఉన్న తమ అకాడమిలో ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ, ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ చింత గణేష్, ప్రముఖ వ్యక్తిత్వ నిపుణులు సుధీర్ సంద్రా హాజరవుతారని వివరించారు. పిల్లలను సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఎలా అనే అంశంపై వారు మాట్లాడతారని పేర్కొన్నారు. పిల్లల కెరీర్ ఆప్షన్లు, సాఫ్ట్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత, అధ్యాపకుల పాత్ర వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.