Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 9న చలో హైదరాబాద్ : కేవీపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళితబంధు కోసం 2022-23 బడ్జెట్లో రూ.20వేల కోట్లు కేటాయించాలనీ, దళితులు, పేదలకు ఇండ్ల స్థలాలివ్వాలని కోరుతూ వచ్చే నెల తొమ్మిదిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్ వెస్లీ, టి స్కైలాబ్ బాబు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించినట్టు పేర్కొన్నారు. దళితబంధు పథకాన్ని హైకోర్టు తీర్పుమేరకు రాజకీయలకతీతంగా అర్హులను అధికారుల ద్వారా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. పారదర్శకంగా గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గ పరిధిలోని 5,000మందికి దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్లస్థలాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి 120గజాల స్థలం ఇచ్చి, రూ. 5లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని కోరారు. వచ్చే నెల మూడున మున్సిపాలిటీ పరిధిలో ధర్నాలు, తొమ్మిదిన చలో హైదరాబాద్కు దళితులు తరలిరావాలని విజ్ఞపి చేశారు.