Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడు నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. కాగా, బడ్జెట్ ఆమోదంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర బడ్జెట్‌కు గవర్నర్ తమిళసై ఇంకా ఆమోదం తెలియచేయకపోవడంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తీరును సవాల్ చేస్తూ సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దుశాంత్ దవే వాదన వినిపించనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.