Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతోన్మాదాన్ని వ్యతిరేకించినందుకే అత్యంత దుర్మార్గంగామహాత్మాగాంధీని మతోన్మాదులు హత్యచేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా చెప్పారు.సోమవారం హైదరాబాద్‌లోని మఖ్ధూం భవన్లో గాంధీ వర్ధంతి సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఇటి.నర్సింహాలతో కలిసి అజీజ్‌పాషా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ జీవిత కాలం మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారన్నారు. ఆయన మీద ఢిల్లీి బిర్లాహౌజ్లో హత్యా యత్నం జరిగిందనీ, హత్యకు పాల్పడిన వ్యక్తిని ఆరెస్టు చేయకుండా ఆపిన మహానీయుడు గాంధీ అని గుర్తుచేశారు. గాంధీ వర్ధంతి రోజున సీపీిఐ జాతీయ సమితి లౌకికవాద పరిరక్షణ దినంగా పాటిటించాలని పిలుపునిచ్చిందన్నారు. దేశంలో మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తుల ఆగడాలు పెరిగిపోయాయనీ, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారని తెలిపారు.