Authorization
Wed April 30, 2025 04:18:34 am
- ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ఫ్యాకల్టీ
- పోటీ పరీక్షలపై టీఏవీఎస్ ఆధ్వర్యంలో సదస్సు
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, యువకులు ఆయా పరీక్షలకు సంబంధించి ప్రతి సబ్జెక్టుపైనా అవగాహన కలిగి ఉండాలని ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ఫ్యాకల్టీ జనార్దన్ దండు, ప్రభాకర్ చౌటి అన్నారు. సోమవారం తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం (టీఏవీఎస్) ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని జడ్పీ సమావేశ మందిరం, ఉట్నూర్ పీఎంఆర్సీలో యూపీఎస్సీ, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వివిధ కళాశాలల విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్దన్ దండు, ప్రభాకర్ చౌటి అవగాహన కల్పించారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విధానం.. స్టడీ మెటీరియల్, ప్రణాళిక తదితర వాటి గురించి క్లుప్తంగా వివరించారు. పోటీ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టుపైనా అవ గాహన పెంచుకొని రివిజన్ చేస్తూ చదవాలని సూచించారు. భయ పడకుండా ఏకాగ్రతతో ప్రణాళికబద్ధంగా చదవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ పరిపాలన అధికారి కోట సతీష్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైెరెక్టర్ రమేష్, టీఏవీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, జిల్లా కార్యదర్శి బైరి సోమేశ్, ఉట్నూర్‌లో జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేస్రం రాజు, జిల్లా అధ్యక్షులు తుమ్రం ఈశ్వర్, నాయకులు తనూష్, ఉయిక విష్ణు, కుంరం దీపక్, కొట్నాక్ సక్కు పాల్గొన్నారు.