Authorization
Thu May 01, 2025 08:59:43 am
- తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష పరిరక్షణ కోసం చట్టం చేసిందనీ, మాతృభాష పరిరక్షణ కోసం కట్టుబడి ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశం కర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచి తెలుగును తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిందేనని ప్రభుత్వ, ప్రయిy ేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు.సీఎం కేసీఆర్ చొరవ తోనే తెలుగును తప్పని సరిచేయటంతో తెలుగు సాహితీమూర్తులు చేసిన సాహిత్య సేవలను, కృషిని ఈతరం అధ్యయనం చేస్తున్నదని చెప్పారు.