Authorization
Wed April 30, 2025 07:30:34 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కొండగట్టులో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టుకు చేరుకుంటారు. ఉదయం 9:40 గంటలకు అక్కడి ఆంజనేయ స్వామిని దర్శించుంటారు. కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటిధార, భేతాళ స్వామి ఆలయంతో తదితర ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారులతో కేసీఆర్ సమావేశమవుతారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. వాస్తవానికి సీఎం మంగళవారమే కొండగట్టుకు వెళ్లాల్సి ఉన్నా.. మంగళవారం కొండగట్టుకు హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి కలిగించొద్దనే ఉద్దేశంతో బుధవారానికి ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి.