Authorization
Thu May 01, 2025 03:00:55 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగు కవి తంగిరాల చక్రవర్తి డాక్టర్ సతీష్ చతుర్వేది స్మతి పురస్కారాన్ని అందుకున్నారు. అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ అఖిల భారత మహాసభను శుక్రవారం మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించారు. అక్కడి లయన్స్ క్లబ్ భవన్లో సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వీరేంద్రసింగ్ అధ్యక్షతన, సంస్థ కార్యదర్శి కృతి చతుర్వేది ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సభలో తెలంగాణ శాఖ అధ్యక్షులు కడాలి సత్యమూర్తి, మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్యవిద్యా, పునరావాస మంత్రి విశ్వాస్ సారంగ్ చేతుల మీదుగా జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.