Authorization
Thu May 01, 2025 09:26:43 am
- హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తన పరిధిలో ఉన్న ఉద్యోగ పోస్టులను రద్దుచేయడమనేది ప్రభుత్వానికుండే చట్టబద్ధమైన అధికారమంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. దీనిపై హక్కుగానీ, ప్రశ్నించే అధికారంగానీ ఉద్యోగులకు లేదని తేల్చి చెప్పింది. ప్రజా ప్రయోజనాలు, పాలనా అవసరాల నిమిత్తమే వీఆర్వో పోస్టులను రద్దు చేశామని స్పష్టం చేసింది. ఇదంతా చట్టబద్ధ ప్రక్రియంటూ పేర్కొంది. రెవెన్యూ శాఖలో ఖాళీలున్నా తమను ఇతర శాఖల్లోకి పంపడం అన్యాయమని పేర్కొంటూ వీఆర్వోలు హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గతంలో విచారించిన సీజే ధర్మాసనం వారిని ఇతర శాఖలకు తరలించడంపై స్టే విధించింది. ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.