Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంద్రబాబు మాటల వక్రీకరణ :
- టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ విమర్శ
నవతెలంగాణ - హైదరాబాద్
దొరలు రాసిచ్చిన స్క్రిప్టును చదవడం బంద్ చేసి వాస్తవాలను మాట్లాడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ న్రెడ్డికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ హితవు పలికారు. ఆహార భద్రత విషయంలో ఎన్టీఆర్ హయాంలో రూ.2 కిలో బియ్యం పథకం గురిం చి తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేసిన వాఖ్యలను మంత్రి వక్రీకరించడాన్ని ఖండించారు. తెలుగుదేశం వచ్చాకే తెలంగాణ ప్రజలు బియ్యం అన్నం తింటున్నారని చంద్రబాబు అనని మాటలను మంత్రి, ఆయ నకు ఆపాదించడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. ఆదివారం ఎన్టీఆర్ భవ న్లో కాసాని మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభిం చిన రూ.2 కిలో బియ్యం పథకం ద్వారా 1983లోనే ఎన్టీఆర్ పేదవర్గాలకు ఆహారభద్రత కల్పించారని గుర్తు చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పింది వాస్తవం కాదా? అని మంత్రిని ప్రశ్నించారు. టీడీపీ చేసిన అభివద్ధి పనుల గురించి, వాటి వల్ల ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరిగాయో తమ పార్టీ అధినేత వివరించడం తప్పేలా అవుతుంది నిలదీశారు.