Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రేమ జంట ఆత్మహత్య
నవతెలంగాణ- దేవరకొండ
తమ వివాహానికి పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా నేరేడు గొమ్ము మండలం కాచరాజుపల్లిలో చోటుచేసుకుంది. డిండి సీఐ పరుశరాములు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామానికి చెందిన అందుగుల భిక్షమయ్య మారతమ్మ కుమారుడు రాకేష్(19) ఇంటర్మీడియట్ చదివాడు. కొండమల్లేపల్లి మండలం దోనియాల గ్రామానికి చెందిన వరికుప్పల కృష్ణయ్య, జయమ్మ కూతురు దేవి(16) దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ఫస్టియర్ చదువుతుంది. కొన్ని నెలల కింద వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దేవిని వివాహం చేసుకుంటానని రాకేష్ కొన్ని రోజుల కింద తల్లి మారతమ్మకు చెప్పడంతో ఆమె అందుకు ఒప్పుకోలేదు. అయితే రాకేష్ తండ్రి గతంలో చని పోయాడు. తాను ప్రేమించిన విషయం దేవి తల్లిదండ్రులకు చెప్పలేదు. ఈనెల 25వ తేదీన కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో బంధువుల వివాహ శుభకార్యానికి దేవి వచ్చింది. ఆదివారం ధోనియాల గ్రామం నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. రాకేష్ తన ద్విచక్ర వాహనంపై దేవిని ఎక్కించుకొని నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామ శివారులోని ఓ దేవాలయం వైపు వెళ్లారు. అక్కడ దేవాలయం ముందున్న చెట్టుకు ఆదివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకుందామనుకొని మందు డబ్బాను కూడా తీసుకొని పోయి అక్కడే వదిలేశారు. సోమవారం ఉదయం గ్రామస్తులు చూసి పోలీసులకు సమా చారం ఇచ్చారు. మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.