Authorization
Thu May 01, 2025 05:36:59 pm
- నోటిఫికేషన్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్-2023 నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. సోమవారం నుంచి ఆన్లైన్లో ఎడ్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎస్సీ,ఎస్టీ, వికలాంగులకు దరఖాస్తు ఫీజు రూ.500, ఇతరులు రూ.700 చెల్లించాలి. ఆలస్య రుసుం లేకుండా వాటి సమర్పణకు ఏప్రిల్ 20వ తేదీ వరకు అవకాశమున్నది. ఆలస్య రుసుం రూ.250తో అదేనెల 25 వరకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుల సవరణకు చివరి తేదీ ఏప్రిల్ 30 వరకు ఉంటుంది. హాల్‌టికెట్లను మే ఐదో తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 18న ఎడ్‌సెట్ రాతపరీక్షను నిర్వహిస్తారు. పరీక్షా సిలబస్, ఇతర వివరాలకు https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, లో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వీసీ సిహెచ్ గోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ టి కృష్ణారావు, ఓఎస్డీ ఎ రవికుమార్, ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ రామకృష్ణ, కో కన్వీనర్ పి శంకర్ తదితరులు పాల్గొన్నారు.