Authorization
Sat May 03, 2025 04:21:30 pm
- రాష్ట్ర ముఖ్య సలహాదారురాలిగా షీబా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ముఖ్య సలహాదారురాలిగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (హెచ్ఆర్సీ) మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు షీబా నియమితురాలయ్యారు. హైదరాబాద్ తార్నాకలోని హెచ్చార్సీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ నియమక పత్రాన్ని అందజేశారు. అనంతరం 12న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్చార్సీ దక్షిణ భారతదేశ అధ్యక్షులు ఆర్ఎస్ జే థామస్, ఫోరమ్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొత్వల్ దయానంద్, ప్రధాన కార్యదర్శి పి.సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.