Authorization
Thu May 01, 2025 09:26:43 am
హైదరాబాద్: డయాలసిస్ కేర్లో అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న బాక్ట్సర్ ఇండియా కొత్తగా 'చూజ్ ఫ్రీడమ్' ప్రచారాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. సమయానికి డయాలసిస్ చేయించుకోవాల్సిన ఆవశ్యకత తెలపడంతో పాటుగా తుది దశ మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులు (ఇఎస్కెడి) రోగులకు పెరిటోనియల్ డయాలసిస్ (పిడి) చికిత్స పట్ల అవగహన సైతం మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ''దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకరంగా మారాయి. దాదాపు 85 కోట్ల మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. మధుమేహంతో పాటుగా అభివృద్థి చెందే సికెడి కారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ కూడా కావొచ్చు. ఈ ఆరోగ్య ఆందోళనలను పరిష్కరించేందుకు తప్పనిసరిగా చర్యలను తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.'' అని బాక్ట్సర్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ జనరల్ మేనేజర్ రిషబ్ గుప్తా పేర్కొన్నారు.