Authorization
Tue April 29, 2025 11:05:50 am
- గురుకుల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ గురుకులాల్లో 6,7,8 తరగతులు, ఇంటర్, డిగ్రీలో ఉన్న ఖాళీ సీట్లలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్యభట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://mjptbcwreis. telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. 6,7,8 తరగతులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 20 చివరి తేదీ అనీ, మే రెండున హాల్ టికెట్లు అందు బాటులో ఉంటాయనీ, మే 10న పరీక్షను నిర్వహిస్తామంటూ వివరించారు. ఇంటర్, డిగ్రీ సీట్ల కోసం ఏప్రిల్ 16 చివరి తేదీ కాగా ఏప్రిల్ 20 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఆగష్టు 31నాటికీ అన్ని తరగతుల్లో అడ్మిషన్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వివరాలకు 040 - 23328266, 23322377 నంబర్లను సంప్రదిం చాలని సూచించారు.