Authorization
Sat May 03, 2025 04:09:55 pm
- బుధవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలి
- రాష్ట్ర మహిళా కమిషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సోమవారం నోటీసులు జారీ చేసింది. మార్చి 15న ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట హాజరుకావాలని సంజరుకి సూచించింది. బీఅర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మహిళా కమిషన్ ముందు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో 15న విచారణకు హాజరుకాలేనని బండి సంజయ్‌కుమార్ మహిళా కమిషన్‌కు లేఖ రాశారు. ఈ నెల 18న సమయమిస్తే ఆరోజు విచారణకు హాజరవుతానని తెలిపారు.