Authorization
Fri May 02, 2025 03:45:41 am
హైదరాబాద్: ఎల్ఐసీ ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ జోన్ హెడ్‌గా ఎల్‌కె శామ్‌సుందర్ మంగళ వారం బాధ్యతలను స్వీకరించారు. ఇకపై ఆయన ఈ జోనల్ మేనేజర్‌గా కొనసాగనున్నారు.ఇంతక్రితం ఆయన సికింద్రాబాద్ జోర్హత్ డివిజన్లకు డివిజనల్ మేనేజర్‌గా పని చేసిన అనుభవం ఉంది. జోనల్ ట్రెయినింగ్ సెంటర్, హైదరాబాద్‌కు డైరెక్టర్‌గా, ముంబయి కార్యాలయంలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేశారు. దాదాపు 35 ఏండ్లుగా బీమా రంగంలో వివిధ హోదాల్లో సేవలందిస్తూ ఉన్నారు. సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. వైద్య బీమాలో ఆయన డిప్లమా చేశారు.