Authorization
Tue April 29, 2025 11:05:49 am
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌పై విచారణను ఆయన కోరిక మేరకు ఈ నెల 18వ తేదీన అనుమతిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. తనకు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 15వ తేదీ కమిషన్ ఎదుట హాజరు కాలేననీ, ఈ నెల 18వ తేదీన కమిషన్ చైర్పర్సన్ సూచించిన సమయానికి హాజరవుతానని లేఖలో అభ్యర్థించగా కమిషన్ అందుకు సానుకూలంగా స్పందించింది. 18న 11గంటలకు హాజరు కావాలని సూచించింది. 18న హాజరుకాలేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసు ద్వారా హెచ్చరించింది.