Authorization
Sat May 03, 2025 12:32:37 am
- 'వరల్డ్ స్లీప్ డే థీమ్'లో టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ డ్రైవర్లు నిద్రపై సరైన దష్టి పెట్టాలనీ, లేకుంటే ఆరోగ్యసమస్యలు ఎదుర్కొవలసి వస్తుందని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. నిద్ర ప్రాముఖ్యత, ఆరోగ్య సమస్యలపై డ్రైవర్లకు సంపూర్ణ అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ నిద్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ బస్‌భవన్‌లో 'వరల్డ్ స్లీప్ డే థీమ్'ను ఆయన ఆవిష్కరించారు. సంపూర్ణ ఆరోగ్యానికి కంటి నిండా నిద్ర చాలా అవసరమనీ, అది సక్రమంగా లేకుంటే అలసటతో పాటు ఏకాగ్రత కూడా లోపించి పనిమీద శ్రద్ధ తగ్గుతుందని చెప్పారు.
కోవిడ్ ఉధతి తర్వాత నిద్ర సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నదని పలు అధ్యయానాలు వెల్లడిస్తున్నాయనీ, ఫలితంగా శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు. స్మార్ట్‌ఫోన్, ఇతర గ్యాడ్జెట్స్‌తో బెడ్‌పై గంటల కొద్దీ గడపొద్దన్నారు. నిద్రసంబంధిత సమస్యలపై ప్రజలు స్వీయ అవగాహన కలిగి ఉండాలన్నారు.
సరిగా నిద్రరాకుంటే ట్యాబ్లెట్లు వేసుకోవడం కొందరికి అలవాటుగా మారిందనీ, వీటివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రముఖ స్లీప్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ నిద్రలేమి వల్ల కలిగే ఆరోగ్య సమస్యల్ని వివరించారు. వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటామనుకోవడం సరికాదన్నారు. నిద్రలేమి వల్ల హైపర్‌టెన్షన్, గుండె సమస్యలు, డిప్రెషన్ వంటివి వస్తాయన్నారు.
కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) డాక్టర్ వి.రవీందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్‌కుమార్, మునిశేఖర్, సీపీఎం కష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవనప్రసాద్, సీఈఐటీ రాజశేఖర్, సీటీఎం(ఎంఅండ్సీ) విజరు కుమార్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, న్యూట్రిషియనిస్ట్ కావ్య తదితరులు పాల్గొన్నారు.