Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు కిలోల మగ శిశువు జననం
- హైదరాబాద్ దవాఖానా ఘనత
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ప్రభుత్వ దవాఖానాల్లో ఆపరే షన్లను తగ్గించేందుకుగాను నార్మల్ డెలివరీలపై వైద్య అధి కారులు మొగ్గు చూపుతున్నారు. తాజాగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింగ్ కోఠి జిల్లా దవాఖానాలో శుక్రవారం గర్భిణికి ఇబ్బంది లేకుండా ఆధునిక పరికరం వాక్యూమ్ ఎక్స్‌ట్రాక్టర్‌తో సాధారణ ప్రసవం చేశారు. నాలుగు కిలోల మగశిశువుకు తల్లి జన్మనిచ్చింది. ఇంత బరువు గల శిశువు ఈ ప్రక్రియ ద్వారా జన్మించడం ఆస్పత్రిలో తొలిసారి అని గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ జలజ వీరోనిక తెలిపారు. చంపాపేట్ ప్రాంతానికి చెందిన ఓంప్రకాష్, మోనమ్మ దంపతులు. మోనమ్మకు మొదటి కాన్పు కోసం మార్చి 29న కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో చేరింది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు శుక్రవారం ఉదయం మోనమ్మను డెలివరీ కోసం లేబర్ రూమ్‌కు తరలించారు. అయితే, నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్నా.. ఆమె గర్భంలో నాలుగు కిలోల శిశువు ఉండటం.. తల సైజు పెద్దగా ఉండటంతో తల్లికి ఇబ్బంది కలుగుతుందని వైద్యులు గ్రహించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వైద్యులు వాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ అత్యాధునిక పరిక రంతో సులువుగా ప్రసవం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సరిత వైద్య బృందాన్ని హెచ్ఓడీ డాక్టర్ జలజ, సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, ఆర్ఎంఓ డాక్టర్ సాధన అభినందించారు. అలాగే, వారికి ఓం ప్రకాష్ మోనమ్మ దంపతులు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.