Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్బ్యూరో
సామాన్య ప్రజానీకానికి బ్యాంకింగ్ సేవలందిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార రంగ రక్షణ కోసం బ్యాంక్ ఎంప్లాయూస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకత్వంలో ఈనెల 4న ఢిల్లీలో మహాధర్నాను జయప్రదం చేయాలని బెఫీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరామయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ ధర్నాకు బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, గ్రామీణ ప్రాంతాలతో సహా బ్యాంకింగ్ సేవలందిస్తూ రైతు బంధు, పెన్షన్, తదితర పథకాలు, ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం, చేతివృత్తులు, చిన్న, చిన్న పరిశ్రమలకు రక్షణ కల్పించి బ్యాంకులు ఆర్థికాభివృద్ధికి తోడ్ప డుతున్నాయని తెలిపారు. కానీ ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకులను, గ్రామీణ బ్యాంకులను ప్రయివేటీకరించి, సహకార రంగాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇది దేశాభివృద్ధికి, ప్రజల సొమ్ము భద్రతకు, బ్యాంకింగ్ సేవలకు ప్రమాదమకరమని హెచ్చరి 0ంచారు. పదేండ్లలో లక్ష మంది నిరుద్యోగులకు ప్రభుత్వ బ్యాంకులు ఉద్యోగాలు కల్పించాయని గుర్తుచేశారు. బప్రభుత్వ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులను ప్రయివేటికరించే ఎన్పీఎస్ను రద్దు చేసి పాతపెన్షన్ పథకాన్ని ఉద్యోగులందరికీి వర్తింపచేయాలని, రిటైరైన బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ సవరణ వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.