Authorization
Wed April 30, 2025 02:18:00 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వికారాబాద్ జిల్లా తాండూర్లో పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం బయటికి రావడంపై సమగ్ర విచారణ జరపాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాస్తున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పరీక్షలపై నమ్మకం కోల్పోతున్న విద్యార్థులు : ఏఐఎస్ఎఫ్
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. వరుస లీకేజీలతో పరీక్షల పట్ల విద్యార్థులు నమ్మకం కోల్పోతున్నారని తెలిపారు. లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ లోపం : పీడీఎస్యూ
పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల లోపం స్పష్టంగా కనిపిస్తున్నదని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ విమర్శించారు. పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలిపారు.
బాధ్యులను కఠినంగా శిక్షించాలి : పీడీఎస్యూ
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పి మహేష్, ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. లీకైందని నిర్ధారణ అయితే సంబంధిత బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు.
దోషులను కఠినంగా శిక్షించాలి : పీడీఎస్యూ
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం, ప్రధాన కార్యదర్శి ఇడంపాక విజరుకన్నా డిమాండ్ చేశారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.