Authorization
Fri May 02, 2025 08:13:25 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబాఫూలే 197వ జయంతి వేడుకల పోస్టర్ను మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, ఎల్. రమణ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు ఉత్సవ కమిటీ ప్రతినిధుల సమక్షంలో అసెంబ్లీ ఆవరణలో శనివారం ఆవిష్కరించారు. ఈనెల 11న ఉదయం 10 గంటల నుంచి రవీంద్రబారతిలో నిర్వహించే ఈ జయంతి వేడుకలకు అందరూ హాజరై విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.