Authorization
Sat May 03, 2025 07:42:41 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 4,92,269 మంది దరఖాస్తు చేసుకుంటే, 4,90,454 (99.63 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 1,815 (0.37 శాతం) మంది గైర్హాజరయ్యారని వివరించారు. ప్రయివేటు విద్యార్థుల్లో 3,397 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 2,326 (68.47 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు. 649 (31.53 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జెడ్పీహెచ్ఎస్ రేగొండలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు.