Authorization
Wed April 30, 2025 12:09:02 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తులో నిర్మించిన విగ్రహం నిరంత స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తుందని బహుజన టీచర్ల సంఘం (బీటీఏ) అధ్యక్షుడు కల్పదర్శి చైతన్య, ప్రధాన కార్యదర్శి మార్వాడీ గంగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి, విజ్ఞానం దిశగా నేటి బాలలు ముందుకు నడవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అసమానతలు తొలగిపోవాలని కోరారు. అణగారిన వర్గాల ప్రాధాన్యతకు సూచికగా నిలువెత్తు విగ్రహం ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉంటుందని తెలిపారు.