Authorization
Thu May 01, 2025 11:37:21 am
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారత రాజ్యాంగాన్ని అవమానించిన ద్రోహి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైసీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్... అంబేడ్కర్‌ను అవమానపరిచారని చెప్పారు. 125 అడుగుల విగ్రహం పెట్టినంత మాత్రాన అంబేద్కర్‌ను గౌరవించినట్టా...? అని ప్రశ్నించారు.