Authorization
Thu May 01, 2025 02:25:01 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ అభినందనలు తెలిపారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్ని శుక్రవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహన్ని నెలకొల్పడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సీఎం మరింత ఖ్యాతిని తీసుకొచ్చారని దామోదర్ కొనియాడారు.