Authorization
Thu May 01, 2025 05:15:08 am
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
125 అడుగుల అంబేద్కర్ విగ్రహ శిల్పి అనిల్ సుతార్‌ను మంత్రులు సన్మానించారు. గురువారం హైదరాబాద్‌లోని శుక్రవారం ఆవిష్కరించిన విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరుపున మెమొంటో వారు ఆయనకు అంద జేశారు. శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఆయనకు హదయ పూర్వక కృతజ్ఞతలు తెలి పారు. (ప్రధానశిల్పి రామ్ సుతార్ 100 ఏండ్లు పైబడిన పెద్ద మనిషి కార్య క్రమానికి హాజరు కాలేక పోయారు) కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఈఈ రవీంద్ర మోహన్, ఆర్కిటెక్ట్ జరు కాక్టికర్, కేపీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు అనిల్ కుమార్, కొండల్‌రెడ్డి, వంశీ వర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.