Authorization
Thu May 01, 2025 03:27:02 am
- ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్బంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక సేవలో భాగంగా పేద విద్యార్థులకు సాయం చేసింది. నగరంలోని జవహార్ నగర్లోనిలోని ఎస్సీ, ఎస్టీ బార్సు హాస్టల్ విద్యార్థులకు స్టడీ టేబుళ్లు, స్టడీ కుర్చీలు అందజేసింది. పీఎన్బీ, హైదరాబాద్, సికింద్రాబాద్ సర్కిళ్ల పీఎన్బీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నగరం లోని ఎఫ్టిసిసిఐలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి పీఎన్బీ హైదరాబాద్ జోనల్ మేనేజర్ మహ్మాద్ మక్సూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్కిల్ హెడ్ ఎన్విఎస్పి రెడ్డి, సికింద్రాబాద్ సర్కిల్ హెడ్ బివి నరేష్, ఆఫీసర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం శివ మోహన్, ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ కెవి రమణ మూర్తి, ఎస్సి, ఎస్టి ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసి యేషన్ హైదరాబాద్ జోనల్ సెక్రటరీ జి వెంకన్న హాజరయ్యారు.