Authorization
Sun April 13, 2025 02:51:37 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ దరఖాస్తు గడువును ఈనెల 29వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు లాసెట్ కన్వీనర్ బి విజయలక్ష్మి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం లేకుండా ఈనెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశముందని తెలిపారు. ఆలస్య రుసుంతో వచ్చేనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేయొచ్చని సూచించారు. అదేనెల 16 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోచ్చని సూచించారు. మే 25న లాసెట్ రాతపరీక్షలుంటాయని వివరించారు. ఇతర వివరాలకు https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. లాసెట్‌కు ఇప్పటి వరకు 35,072 దరఖాస్తులొచ్చాయని తెలిపారు.