Authorization
Sun April 13, 2025 05:53:41 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతనంగా సెట్, నెట్ అర్హత సాధించిన వారికి గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ మల్లయ్య భట్టును శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, సహాయ కార్యదర్శి గ్యార నరేష్, నాయకులు ఉదరు, రఘు, అభ్యర్థులు వీరస్వామి, రాజేంద్ర కలిసి వినతిపత్రం సమర్పించారు. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులు సెట్, నెట్ పరీక్షలు రాసి ఉన్నారని తెలిపారు. వాటి ఫలితాలు కూడా ముందే వచ్చాయని పేర్కొన్నారు.