Authorization
Thu April 10, 2025 01:59:30 am
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్తున్న ఆర్టిజన్ కార్మికులకు పూర్తి మద్దతు ఇస్తున్నామని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ మాట తప్పారని విమర్శించారు. విద్యుత్ సంస్థల్లో ఒకే రకమైన పనికి రెండు రకాల వేతనాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల పోరాటాన్ని విచ్ఛిన్నం చేసేలా యాజమాన్యం ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.